Singer Kalpana: సింగర్ కల్పన హెల్త్ బులెటిన్ విడుదల

- నిజాంపేట ప్రాంతంలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స
- కల్పన నిద్రమాత్రలు మింగారన్న వైద్యులు
- ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని వెల్లడి
టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నిజాంపేట ప్రాంతంలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె నిద్ర మాత్రలు మింగారని వైద్యులు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఆమెకు ఇన్ఫెక్షన్ ఉందని, ఆక్సిజన్ అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.