Speaker Ayyanna Patrudu: ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

speaker ayyanna patrudu announces Sports and cultural events for mlas
  • ఎమ్మెల్యేలకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన స్వీకర్ అయ్యన్న పాత్రుడు
  • 20న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం
  • పురుష, మహిళా ఎమ్మెల్యేలకు వేర్వేరుగా పోటీలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని నిన్న అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. 24 గంటలూ ప్రజా సేవలో ఉండే ప్రజా ప్రతినిధులకు రిలీఫ్ ఉండాలని, అందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పురుష ఎమ్మెల్యేలకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి పోటీలు ఉంటాయని, మహిళా ఎమ్మెల్యేలకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నీ కాయిట్, టగ్ ఆఫ్ వార్, వంద మీటర్ల పరుగు పందెం వంటివి ఉంటాయని, అలాగే పాటలు, నాటకాలు, స్కిట్లు, నృత్యం, సోలో అభినయం తదితర సాంస్కతిక కార్యక్రమాలు ఉంటాయని, అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఆసక్తి ఉన్న ఎమ్మెల్యేలు చీఫ్ విప్, విప్ లకు తమ పేర్లు ఇవ్వాలని స్పీకర్ సూచించారు. 20న రాత్రి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. 

ఈ సందర్భంలో శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ అసెంబ్లీ పాత సంప్రదాయాలను పునరుద్ధరించడం మంచి పరిణామమన్నారు. డ్రాప్ అవుట్ (వైసీపీ) ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని పయ్యావుల ఆహ్వానించారు.  
Speaker Ayyanna Patrudu
Sports and Cultural Events
MLAs

More Telugu News