కేసులు కొట్టేయండి... ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్
- పోసానిపై ఏపీలో వరుస కేసులు
- ఉక్కిరిబిక్కిరి అవుతున్న సినీ నటుడు
- హైకోర్టును ఆశ్రయించిన వైనం
సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించే వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు... చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు... ఇలా వివిధ ఆరోపణలతో పోసానిపై ఏపీలో దాదాపు 16 వరకు కేసులు నమోదయ్యాయి.
తొలుత ఆయనను రాయచోటి పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేయగా, ఆ తర్వాత నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ గుంటూరు జైల్లో ఉన్న ఆయనను ఆదోనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయను గుంటూరు నుంచి ఆదోనికి తరలించినట్టు తెలుస్తోంది.