Nadendla Manohar: అమరావతి ఎర్రబాలెం రోడ్ లో ఎండీయూ వాహనాన్ని తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల

Minister Nadendla Manohar inspects MDU vehicle in Amaravati
  • రేషన్ పంపిణీ వ్యవస్థపై మంత్రి నాదెండ్ల నిశిత పరిశీలన
  • ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని ప్రజలకు సూచన
  • అందరికీ రేషన్ సరఫరా జరుగుతుందని హామీ
ఏపీ పౌర సరఫరాలు, ఆహారం శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ పంపిణీ వ్యవస్థపై నిశిత పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ క్రమంలో, నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో ఎర్రబాలెం రహదారిపై ఓ ఎండీయూ (రేషన్) వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రజలకు అందించిన రేషన్ సరుకు వివరాలను పరిశీలించారు. రోజుకి ఎంతమందికి రేషన్ అందజేస్తున్నారు అనే వివరాలను పరిశీలించారు. 

అంతేకాకుండా, స్థానిక ప్రజలతో మాట్లాడి రేషన్ పొందడంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, ఎలాంటి ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని సూచించారు. అందరికీ రేషన్ సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు.
Nadendla Manohar
Ration Supply
Inspection
Amaravati

More Telugu News