ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో కీలక పరిణామం... అందుబాటులోకి కన్వేయర్ బెల్ట్
- గత నెల 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం
- 8 మంది గల్లంతు
- 11 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
- తాజాగా కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన సిబ్బంది
- కన్వేయర్ బెల్టు సాయంతో బురద బయటికి తరలిస్తున్న సహాయక బృందాలు
ఈ నేపథ్యంలో, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. టన్నెల్ వద్ద కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక సిబ్బంది కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. కన్వేయర్ బెల్టు సాయంతో టన్నెల్ లోని బురదను బయటికి తరలిస్తున్నారు. దాంతో, సహాయక చర్యల్లో కొద్ది మేర పురోగతి కనిపించింది.
దీనిపై అధికారులు స్పందిస్తూ... ఘటన స్థలం నుంచి 6 వేల క్యూబిక్ మీటర్ల బురదను తొలగించాల్సి ఉందని తెలిపారు. టన్నెల్ లో 200 అడుగుల వరకు బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయని వివరించారు.