పెన్షన్ డబ్బులతో పరారైన సచివాలయ ఉద్యోగి... సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడో చూడండి!
- పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఘటన
- సచివాలయం-3లో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న లక్ష్మీప్రసాద్
- ప్రజలకు పంపిణీ చేయాల్సిన రూ.11.5 లక్షల డబ్బుతో పరార్
- ఆ డబ్బంతా ఆన్ లైన్ బెట్టింగ్ లో పెట్టానంటూ తాజాగా సెల్ఫీ వీడియో
- ఇలాంటి తప్పు మరోసారి చేయనని, తనను క్షమించాలని వేడుకోలు
పల్నాడు జిల్లా దాచేపల్లిలో సచివాలయం-3 ఉద్యోగి సంపతి లక్ష్మీప్రసాద్ ఇటీవల ప్రజలకు పంపిణీ చేయాల్సిన పెన్షన్ డబ్బుతో పరారవడం సంచలనం సృష్టించింది. వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ ఈ నెల 1న పంపిణీ చేయాల్సిన రూ.11.5 లక్షల డబ్బుతో పరారయ్యాడు. దాంతో అతడి ఆచూకీ కోసం అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అతడు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
పెన్షన్ డబ్బుతో తాను ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడ్డానని లక్ష్మీప్రసాద్ వెల్లడించాడు. జిల్లా కలెక్టర్, కమిషనర్ తన తప్పును మన్నించాలంటూ ఆ వీడియోలో వేడుకున్నాడు. తనకు నెల రోజుల సమయం ఇస్తే, తీసుకెళ్లిన డబ్బు మొత్తం కట్టేస్తానని చెబుతున్నాడు. తాను చేసిన తప్పుకు తన కుటుంబం రోడ్డున పడిందని, గత మూడ్రోజులుగా తన కుటుంబం అంతా పస్తులు ఉంటున్నామని లక్ష్మీప్రసాద్ చెప్పాడు.
కాగా, సెల్ఫీ వీడియోలో లక్ష్మీప్రసాద్ తో పాటు అతడి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాను చేసింది తప్పేనని, మరోసారి ఇలా చేయనని, తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని ప్రాధేయపడుతున్నాడు.