Sanchitha Basu: ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ క్వీన్ పైనే!

Sanchita Basu Special
  • బీహార్ లో పుట్టిపెరిగిన బ్యూటీ 
  • సోషల్ మీడియా ద్వారా పాప్యులర్ 
  • 'తుక్రా కే మేరా ప్యార్'తో మరింత పెరిగిన క్రేజ్ 
  • ఇతర భాషల నుంచి క్యూ కడుతున్న అవకాశాలు  

ఒకప్పుడు టాలెంట్ ఉన్నవాళ్లు అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళడానికీ, నలుగురి దృష్టిలో పడటానికి చాలా సమయం పడుతూ ఉండేది. ఒకవేళ తెరపై కనిపించే అవకాశం వచ్చినా, క్రేజ్ రావడానికి అదృష్టం తోడు కావలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వలన టాలెంట్ ను చూపించడానికి .. అవకాశాలను రప్పించుకోవడానికి ఎక్కువ రోజులు పట్టడం లేదు. అలా ఫాస్టుగా ఎదిగిన బ్యూటీగా 'సంచిత బసు' కనిపిస్తుంది. అందం .. అల్లరి .. హావభావ విన్యాసం కలిస్తే సంచిత అని చెప్పచ్చు. 2004లో తాను బీహార్ లోని 'భాగల్ పూర్' లో జన్మించింది. ఇంటర్ చదువుతూ ఉండగానే 'టిక్ టాక్' వీడియోల ద్వారా ఫేమస్ అయిపోయింది. ఆ తరువాత ఫేస్ బుక్ .. ఇన్ స్టాతో మరింత పాప్యులారిటీని సంపాదించుకుంది. 2022లోనే తెలుగులో 'ఫస్టు డే ఫస్టు షో' సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 

ముద్దుగా .. ముద్దమందారంలా కనిపించే సంచిత చుట్టూ ఇప్పుడు వెబ్ సిరీస్ లు తిరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన 'తుక్రా కే మేరా ప్యార్' వెబ్ సిరీస్ ఆమె క్రేజ్ ను మరింతగా పెంచేసింది. ఈ సిరీస్ లో ఆమె నటన హైలైట్ గా నిలిచింది. ఆల్రెడీ అభిమానులు ఆమెను ఓటీటీ క్వీన్ గా పిలుచుకోవడం మొదలైపోయింది. తెలుగుతో పాటు ఇతర బాషల నుంచి కూడా అవకాశాలు ఆమె ఇంటిబాట పట్టినట్టుగా టాక్. అచ్చు అంజలి మాదిరిగానే అనిపించే ఈ బ్యూటీ, ఏ రేంజ్ లో బిజీ అవుతుందో చూడాలి మరి. 
Sanchitha Basu
Actress
Bollywood

More Telugu News