కంజీవరం పట్టు చీరలో బాడీబిల్డర్ వధువు.. బ్రైడ‌ల్ లుక్స్ వైర‌ల్‌!

  • కర్ణాటకకు చెందిన బాడీబిల్డర్ చిత్ర పురుషోత్తం
  • ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో భాగంగా వ‌ధువు గెట‌ప్‌లో దిగిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌
  • చీర‌లో చిత్ర అంద‌రిలా సిగ్గుతో కాకుండా గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ ఫొటోల‌కు పోజు
ఆమె ఓ బాడీబిల్డర్. త‌న అద్భుతమైన శరీరాకృతితో వంద‌ల కొద్ది అవార్డుల‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఆమె  
కర్ణాటకకు చెందిన బాడీబిల్డర్ చిత్ర పురుషోత్తం. తాజాగా ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో భాగంగా వ‌ధువు గెట‌ప్‌లో ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. దాంతో గతంలో ఎన్నడూ చూడని విధంగా సంప్రదాయంతో అద్భుతమైన శరీరాకృతిని మిళితం చేస్తూ నెట్టింట‌ ఆమె సంచలనం సృష్టిస్తున్నారు. 

ఇక తన పెళ్లి రోజున చిత్ర పసుపు, నీలం రంగు కంజీవరం చీరను ధరించారు. చీర‌కు త‌గ్గ‌ట్టుగా ఆభరణాలు ధ‌రించ‌డంతో ఆమె లుక్ మ‌రింత హైలైట్ అయింది. కాగా, చీర‌లో చిత్ర అంద‌రిలా సిగ్గుతో కాకుండా గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ కెమేరాకు పోజులిచ్చారు. ఇక ఎప్పుడూ బాడీబిల్డ‌ర్ డ్రెస్సుల్లో క‌నిపించే ఆమె ఇలా చీర‌, న‌గ‌ల‌తో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 



More Telugu News