'కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రేసులో పంత్

  • ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయిన రిషబ్ పంత్
  • లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు 2025లో కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో నామినేట్
  • 2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్
ప్రతిష్ఠాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు 2025కి భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ నామినేట్ అయ్యారు. కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ఆయన పోటీలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న అవార్డుల కార్యక్రమం జరుగుతుంది.

2022 డిసెంబర్ నెలలో రిషబ్ పంత్ (27) ఒక భయంకరమైన కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత దృఢ సంకల్పం, కఠోర శ్రమ కారణంగా రిషబ్ గత ఏడాది ఐపీఎల్ ద్వారా క్రీడా మైదానంలోకి పునరాగమనం చేశారు.

కారు ప్రమాదం తర్వాత తన మొదటి మ్యాచ్‌లో రిషబ్ బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. రిషబ్ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. 


More Telugu News