Youtuber Ranveer Alhabadia: ఎట్టకేలకు ఆ యూట్యూబర్ కు సుప్రీంకోర్టులో ఊరట

Youtuber Ranveer Alhabadia gets consolation in Supreme Court
  • ఇటీవల పాడ్ కాస్ట్ లో విపరీత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అల్హాబాదియా
  • తల్లిదండ్రుల శృంగారం గురించి అడిగి విమర్శలపాలు
  • యూట్యూబర్ పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్
తల్లిదండ్రుల శృంగారం గురించి ఓ పాడ్ కాస్ట్ లో విపరీత ప్రశ్నలు అడిగి చిక్కుల్లో పడిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రణవీర్ అల్హాబాదియా నిర్వహించిన ఇండియాస్ గాట్ లేటెంట్ ఎపిసోడ్ వివాదాస్పదం అయింది. అతడిపై అసోంలోని గువాహటిలో కేసు నమోదైంది. పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. 

దాంతో సదరు యూట్యూబర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన కేసులను కలిపి విచారించాలని, గువాహటి పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. అతడి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇండియాస్ గాట్ లేటెంట్ పాడ్ కాస్ట్ ను నిలిపివేయాలన్న ప్రాసిక్యూషన్ వాదనలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆ పాడ్ కాస్ట్ ను కొనసాగించుకోవచ్చని యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు ఉపశమనం కల్పించింది.

ముఖ్యంగా, తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అతడిని అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో, యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు కూడా మొట్టికాయలు వేసింది. భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని స్పష్టం చేసింది. అశ్లీల పదాలు వాడుతూ హాస్యం పుట్టించాలని ప్రయత్నించడం సరికాదని పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛను నైతికతతో సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అతడికి హితవు పలికింది.
Youtuber Ranveer Alhabadia
India's Got Latent
Supreme Court
Podcast

More Telugu News