Chhaava: 'ఛావా' తెలుగు ట్రైలర్.. గూస్‌బంప్స్ పక్కా!

- విక్కీ కౌశల్, లక్ష్మణ్ ఉటేకర్ కాంబోలో 'ఛావా'
- శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం
- ఫిబ్రవరి 14న విడుదలైన సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల
- 'ఛావా'ను తెలుగులో విడుదల చేస్తున్న గీతా ఆర్ట్స్
- ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'ఛావా'. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే హిట్ టాక్ సొంతం చేసుకున్న 'ఛావా' బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతున్న ఛావాను ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ధైర్యం, కీర్తిల గొప్ప మేళాయింపుతో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యకావ్యం ఇప్పుడు తెలుగులో వస్తోందంటూ ట్రైలర్‌ను విడుదల చేసింది. గూస్‌బంప్స్ తెప్పించే దృశ్యాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.