Thandel: ఓటీటీలోకి తండేల్ .. ఎప్పుడంటే ..!

- ఓటీటీలోకి నాగచైతన్య సినిమా
- ఫిబ్రవరి 7న విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘తంఢేల్’
- మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘తండేల్’ గురించిన ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 7న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇంతకాలం థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా, చిత్ర నిర్మాతలు ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. మార్చి 7 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ‘ఎక్స్’ ద్వారా అధికారికంగా తెలియజేసింది.