Abrar: కోహ్లీపై పాక్ స్పిన్నర్ సంచలన పోస్ట్.. వైరల్ గా మారిన ట్వీట్

Abrar Ahmed shares cryptic post for Virat Kohli days after Champions Trophy match
  • కోహ్లీ ఆటను ఆరాధిస్తూ పెరిగినట్లు వెల్లడి
  • తన చైల్డ్ హుడ్ హీరో అంటూ ట్వీట్
  • అతడికి బౌలింగ్ చేసే అవకాశం దక్కడం అదృష్టమని వ్యాఖ్య
ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత్ పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కనుసైగలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అద్భుతమైన బాల్ తో శుభ్ మన్ గిల్ ను ఔట్ చేసిన అబ్రార్.. ఆపై చేతులు కట్టుకుని గిల్ వైపు చూస్తూ పెవిలియన్ కు వెళ్లిపోమంటూ సైగ చేశాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న కోహ్లీ ఇది గమనించి కాస్త అసహనం వ్యక్తం చేశాడు. అయితే, మ్యాచ్ తర్వాత అబ్రార్ ను కోహ్లీ మెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కోహ్లీని ఉద్దేశించి అబ్రార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

తన చిన్నతనంలో కోహ్లీ ఆటను ఆరాధించేవాడినని అబ్రార్ చెప్పాడు. కోహ్లీ తన చైల్డ్ హుడ్ హీరో అని వెల్లడించాడు. అతడికి బౌలింగ్ చేసే అవకాశం దక్కడం అదృష్టమని వివరించాడు. అతడు కేవలం మ్యాచ్‌ సమయంలోనే క్రికెటర్‌గా ఉంటాడని, వ్యక్తిగతంగా చాలా మంచివాడని కోహ్లీని మెచ్చుకున్నాడు. మైదానంలో, బయటా స్ఫూర్తి నింపడంలో కోహ్లీ ముందుంటాడని, అదే అతడి గొప్పతనమని అబ్రార్ చెప్పాడు.
Abrar
Virat Kohli
Cricket
India Pak Match

More Telugu News