Pregnant Woman: ఉద్యోగం కోసం పరీక్ష రాస్తుండగా పురుటి నొప్పులు.. ఆసుపత్రిలో ప్రసవం

Pregnant Woman Writing REET Exam Gives Birth To Baby Girl In Rajasthan
--
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కష్టపడి సిద్ధమైన ఓ మహిళకు పరీక్ష రాస్తుండగా పురుటినొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా వైద్యులు డెలివరీ చేశారు. పరీక్ష రాయలేకపోయినప్పటికీ పండంటి కూతురుకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని ఆ మహిళ చెప్పింది. రాజస్థాన్ లో ఈ నెల 28న చోటుచేసుకుందీ ఘటన. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం అర్హత పరీక్ష (రీట్) నిర్వహించింది. గత నెల 27, 28 తేదీలలో ఈ పరీక్షలు జరిగాయి.

టోంక్ జిల్లా మాల్ పురాలో గత నెల 28వ తేదీన పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ప్రియాంక చౌధరి అనే గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో అంబులెన్స్ పిలిపించి నిర్వాహకులు ప్రియాంకను టోంక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ సాధారణ ప్రసవం జరిగి, ప్రియాంక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పరీక్ష మరోసారి రాసుకోవచ్చు కానీ తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని ప్రియాంక భర్త జీత్‌రామ్‌ చౌధరి సంతోషం వ్యక్తం చేశారు.
Pregnant Woman
Competative Exam
Reet
Delivery
Baby Girl
Rajasthan

More Telugu News