Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసు.. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు నోటీసులు

Raghu Rama Krishna Raju Custodial Torture Case Sent Notices To Sunil Naik

  • దర్యాప్తులో మరో అడుగు ముందుకు
  • అప్పట్లో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్
  • రఘురామ కేసులో ఆయన పాత్రపైనా అనుమానం
  • బీహార్‌లో ఉన్న సునీల్ నాయక్‌కు వాట్సాప్, ఫ్యాక్స్ ద్వారా నోటీసులు

మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసు దర్యాప్తులో మరో అడుగు ముందుకు పడింది. అప్పట్లో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్‌ను విచారించేందుకు దర్యాప్తు అధికారి, ప్రకాశం ఎస్పీ దామోదర్ రెండ్రోజుల క్రితం నోటీసులు పంపారు. రఘురామరాజును హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు సునీల్ నాయక్ కూడా వచ్చినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో ఆయన పాత్రపైనా విచారించాలని నిర్ణయించిన అధికారులు ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. 

బీహార్ క్యాడర్‌కు చెందిన సునీల్ నాయక్‌ను వైసీపీ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి సీఐడీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే సునీల్ నాయక్ తిరిగి బీహార్ వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడాయన అగ్నిమాపకశాఖ విభాగంలో డీఐజీగా పనిచేస్తున్నారు.

Raghu Rama Krishna Raju
Sunil Naik
Custodial Torture Case
Andhra Pradesh
  • Loading...

More Telugu News