Sankranthiki Vasthunam: ఓటీటీలో 'సంక్రాంతికి వస్తున్నాం' రన్ టైమ్ తగ్గింది!

sankranthiki vasthunam run time reduced in ott

  • ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ
  • తగ్గిన ఓటీటీ వెర్షన్ నిడివి 
  • థియేటర్‌లో 2 గంటల 24 నిమిషాల మూవీ ప్రదర్శన
  • జీ 5లో కేవలం 2 గంటల 16 నిమిషాల నిడివితో సినిమా 

థియేటర్లలో అలరించిన పలు చిత్రాలు ఓటీటీలో అదనపు నిడివితో విడుదల కాగా, సంక్రాంతికి వినోదాల విందు పంచిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాత్రం తగ్గిన నిడివితో ఓటీటీలోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఒకేసారి టెలివిజన్ ప్రీమియర్ ప్రసారంతో పాటు ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది.

అయితే, సినిమా నిడివి విషయంలో ఊహించని షాక్ తగిలింది. థియేటర్లో 2 గంటల 24 నిమిషాలు ప్రదర్శితమైన ఈ చిత్రం, ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాల నిడివితో జీ 5లో అందుబాటులో ఉంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. థియేటర్ వెర్షన్‌లో నిడివి కారణంగా తొలగించిన కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి ఓటీటీలో చేరుస్తారని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ముఖ్యంగా, సినిమా ఫ్లాష్ బ్యాక్ లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను జతచేస్తారని ప్రచారం జరిగింది. అయితే, అదనపు సన్నివేశాలు చేర్చకపోగా, ఉన్న సన్నివేశాలకే కత్తెర వేసినట్లు తెలుస్తోంది. దాదాపు 8 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తొలగించడంపై మూవీ టీమ్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. 

  • Loading...

More Telugu News