Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం అంటూ వార్తలు... వాస్తవం ఇదే!

PR Team condemns news that Chiranjeevi receiving honorary UK citizenship
  • మీడియా వార్తలపై స్పందించిన పీఆర్ టీమ్
  • ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ
  • మీడియా సంస్థలు నిజ నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ ప్రభుత్వం గౌరవం పౌరసత్వం ఇస్తోందంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన యూకే పౌరసత్వం స్వీకరించబోతున్నారని ఆయా కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై చిరంజీవి పీఆర్ టీమ్ స్పందించింది. చిరంజీవి గారు బ్రిటన్ దేశపు గౌరవ పౌరసత్వం అందుకోబోతున్నారంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇటువంటినిరాధార వార్తలు ప్రచురించేటప్పుడు మీడియా సంస్థలు ఓసారి నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ నటించేందుకు చిరంజీవి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Chiranjeevi
UK Citizenship
PR Team
Tollywood

More Telugu News