Viral Videos: ఎడారి ప్రాంతంలో మంచు వ‌ర్షం... రాజ‌స్థాన్‌లోని చురులో ఊహించ‌ని ప‌రిణామం!

Rajasthan City Churu Known for Extreme Heat Into Winter Wonderland Creating Kashmir Like Scenes
  
భారీ ఉష్ణోగ్ర‌త‌ల‌తో మండిపోయే రాజ‌స్థాన్‌లోని చురు ప్రాంతం తాజాగా మంచుతో నిండిపోయింది. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా శుక్ర‌వారం నాడు ఈ ప్రాంతంలో వ‌డ‌గ‌ళ్ల వాన కురిసింది. దీంతో ఆ ప్రాంత‌మంతా మంచు గ‌డ్డ‌ల‌తో నిండిపోయి క‌శ్మీర్‌ను త‌ల‌పిస్తోంది. 

ఇందుకు సంబంధించిన వీడియోల‌ను స్థానికులు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి కాస్తా వైర‌ల్ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజ‌న్లు ఎడారి ప్రాంతంలో మంచు వ‌ర్షం అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా, వ‌డ‌గ‌ళ్ల కార‌ణంగా పంట‌లు దెబ్బ‌తిని రైతుల‌కు భారీ న‌ష్టం వాటిల్లింద‌ని స‌మాచారం. సాధార‌ణంగా మార్చి నెల‌లో ఈ ప్రాంతంలో స‌గ‌టు కంటే ఎక్కువ‌గా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతుంటాయ‌ని తెలుస్తోంది. 
Viral Videos
Rajasthan
Churu City

More Telugu News