ఇయర్ ఫోన్లు ఎక్కువగా వాడొద్దు.. ఆ తర్వాత మీ ఇష్టం.. తమిళనాడు ప్రజారోగ్యశాఖ హెచ్చరిక

  • ఇయర్ ఫోన్లతో వినికిడి లోపం వస్తుందన్న ఆరోగ్యశాఖ డైరెక్టర్
  • ఈ లోపాన్ని పరికరంతోనూ పరిష్కరించలేమని హెచ్చరిక
  • ఏకధాటిగా రెండు గంటలకు మించి ఇయర్ ఫోన్స్ వాడొద్దని సూచన 
ఇయర్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించవద్దని తమిళనాడు ప్రజారోగ్యశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇయర్‌ఫోన్, హెడ్‌ఫోన్‌ను ఎక్కువ సమయం వినియోగించాక తాత్కాలికంగా వినికిడి సమస్య తలెత్తుతుందని ఆరోగ్యశాఖ డైరెక్టర్ సెల్వవినాయగం తెలిపారు. ఇలా వచ్చే వినికిడి లోపాన్ని సరిచేయలేమని, వినికిడి పరికరం కూడా ఆ సమస్యను పరిష్కరించలేదని తెలిపారు. 

కాబట్టి, సాధారణ స్థాయి కంటే ఎక్కువ ధ్వని ఉండే బ్లూటూత్ ఇయర్ ఫోన్లు, హెడ్‌ఫోన్ తదితర వాటిని అనవసరంగా ఉపయోగించకూడదని సెల్వ వినాయగం పేర్కొన్నారు. అవసరం అనుకుంటే 50 డెసిబెల్స్ కంటే తక్కువ వాల్యూమ్ స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఇయర్ ఫోన్లను రెండు గంటలకు మించి ఏకధాటిగా ఉపయోగించడం మానుకోవాలన్నారు. అలాగే, చిన్నారులు ఫోన్, టీవీని చూడటం తగ్గించాలని సూచించారు.


More Telugu News