Gold: ఇది గమనించారా... బంగారం ధర ఇంకాస్త తగ్గింది!

Gold price dipped a more
  • ఇటీవల దూసుకెళ్లిన బంగారం ధర
  • తాజాగా రూ.500 తగ్గిన వైనం
  • ఢిల్లీలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.87,700
పసిడి ధర ఇటీవల రాకెట్ లా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. 10 గ్రాముల స్వఛ్ఛమైన బంగారం ధర దాదాపు 90 వేల దరిదాపులకు చేరుకుంది. అయితే, బంగారం ధర మళ్లీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా మరో రూ.500 మేర పసిడి ధర తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.87,700 పలుకుతోంది. 

స్టాక్ మార్కెట్లలో ఇన్వెసర్లు లాభాల స్వీకరణకు దిగడం, నగల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో బంగారం ధర దిగొచ్చిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 

మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. నిన్న రూ.98,500 పలికిన కిలో వెండి... నేడు రూ.96,400 పలుకుతోంది.
Gold
Price
India

More Telugu News