ఆసీస్ కు ఓ మోస్తరు టార్గెట్ ఇచ్చిన ఆఫ్ఘనిస్థాన్

  • ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆస్ట్రేలియా × ఆఫ్ఘనిస్థాన్
  • లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ టీమ్
  • 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ 
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ ఓ మోస్తరు స్కోరు చేసింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా మెగా టోర్నీలో ఇవాళ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. 

ఈ గ్రూప్-బి లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. సెదికుల్లా అటల్ 85 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 67 పరుగులతో రాణించాడు. గత మ్యాచ్ లో ఇంగ్లండ్ పై అద్భుత సెంచరీ సాధించిన ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 22 పరుగులు చేసి ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్ లో అవుటయ్యాడు. 

మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (0) డకౌట్ కాగా... రహ్మత్ షా 12, కెప్టెన్ హష్మతుల్లా షాహిది 20, మహ్మద్ నబీ 1, రషీద్ ఖాన్ 19 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షూయిస్ 3, స్పెన్సర్ జాన్సన్ 2, ఆడమ్ జంపా 2, నేథన్ ఎల్లిస్ 1, గ్లెన్ మ్యాక్స్ వెల్ 1 వికెట్ తీశారు.

Champions Trophy 2025
Afghanistan
Australia
Lahore

More Telugu News