Harish Rao: మాజీ మంత్రి హ‌రీశ్‌రావుపై మ‌రో కేసు

Another Case Filed on Ex Minister Harish Rao
  • హ‌రీశ్‌రావు నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే వ్య‌క్తి ఫిర్యాదు
  • మాజీ మంత్రిపై కేసు న‌మోదు చేసిన‌ బాచుప‌ల్లి పోలీసులు
  • హ‌రీశ్‌రావుపై 351(2), ఆర్‌డ‌బ్ల్యూ3(5) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు
మాజీ మంత్రి హ‌రీశ్‌రావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఆయ‌న‌పై చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే వ్య‌క్తి బాచుప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, కేసు న‌మోదు చేశారు. హ‌రీశ్‌రావుతో పాటు మ‌రో ముగ్గురి నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని చక్ర‌ధ‌ర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హ‌రీశ్‌రావుపై 351(2), ఆర్‌డ‌బ్ల్యూ3(5) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు బాచుప‌ల్లి పోలీసులు తెలిపారు. హ‌రీశ్‌రావుతో పాటు సంతోశ్‌ కుమార్, రాములు, వంశీపై కేసు న‌మోదైంది. ఎఫ్ఐఆర్‌లో రెండో నిందితుడిగా పోలీసులు హరీశ్‌రావు పేరును చేర్చారు. 
Harish Rao
BRS
Telangana

More Telugu News