బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు.. నడ్డా వారసుడెవరో?
- ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న జేపీ నడ్డా
- ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకానికి ఏర్పాట్లు
- మార్చి 15న నూతన అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం
ఈ క్రమంలో తెరపైకి పలువురి పేర్లు వచ్చాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత వినోద్ తావడే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మార్చి 15న పార్టీ నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.