బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు.. నడ్డా వారసుడెవరో?

  • ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న జేపీ నడ్డా
  • ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకానికి ఏర్పాట్లు
  • మార్చి 15న నూతన అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం
బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతేడాది ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరోమారు కేంద్రంలో అధికారం చేపట్టింది. దీంతో నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ యోచిస్తోంది.

ఈ క్రమంలో తెరపైకి పలువురి పేర్లు వచ్చాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత వినోద్ తావడే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మార్చి 15న పార్టీ నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

JP Nadda
BJP
BJP Chief

More Telugu News