Jaya Prada: సినీ న‌టి జ‌య‌ప్ర‌ద సోదరుడు మృతి

Jaya Prada Elder Brother Raja Babu Dies
  • జ‌య‌ప్ర‌ద సోద‌రుడు రాజ‌బాబు క‌న్నుమూత‌
  • త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియ‌జేసిన న‌టి 
  • హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో నిన్న మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డి
ప్రముఖ సినీ న‌టి జ‌య‌ప్ర‌ద ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె సోద‌రుడు రాజ‌బాబు క‌న్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో గురువారం మ‌ధ్యాహ్నం రాజ‌బాబు మ‌ర‌ణించిన‌ట్లు జ‌య‌ప్ర‌ద తెలిపారు. 

"నా అన్న‌య్య రాజ‌బాబు మ‌ర‌ణ‌వార్త‌ను మీకు తెలియ‌జేస్తున్నందుకు చాలా బాధ‌గా ఉంది. ఆయ‌న ఈరోజు మ‌ధ్యాహ్నం 3.26 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో క‌న్నుమూశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థించండి. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో పంచుకుంటాం" అని త‌న ఇన్‌స్టా పోస్టులో జ‌య‌ప్ర‌ద పేర్కొన్నారు. 
Jaya Prada
Raja Babu
Tollywood

More Telugu News