MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేసిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌

CM Chandrababu And Nara Lokesh Casts His Vote For MLC Elections
  • ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఎన్నిక‌లు 
  • ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేసిన‌ చంద్ర‌బాబు, లోకేశ్
  • ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం బ‌రిలోకి మొత్తం 25 మంది అభ్య‌ర్థులు
ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి ఈరోజు ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఉండ‌వ‌ల్లిలోని మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌లోని పోలింగ్ కేంద్రంలో చంద్ర‌బాబు, లోకేశ్ త‌మ ఓటు వేశారు. ఇక ఈ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 25 మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. అయితే, వీరిలో కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు (పీడీఎఫ్‌), ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ (కూట‌మి) మ‌ధ్య ప్ర‌ధాన పోటీ నెలకొంది.   
MLC Elections
Chandrababu
Nara Lokesh
Andhra Pradesh

More Telugu News