నంద్యాల జిల్లాలో మందు బాబులకు వినూత్న శిక్ష

  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన మందు బాబులు
  • బనగానపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
  • వారిలో పరివర్తన కోసం వినూత్న తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి
  • ప్లకార్డులతో బహిరంగ ప్రదేశాల్లో మందుబాబుల ప్రదర్శన
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన పలువురు మందు బాబులకు నంద్యాల జిల్లా బనగానపల్లి కోర్టు న్యాయమూర్తి వినూత్న శిక్ష విధించారు. పలు గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన 47 మంది మందు బాబులను పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. 

వారిలో పరివర్తన కోసం బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జి షేక్ అబ్దుల్ రెహ్మాన్ సరికొత్త శిక్ష విధించారు. మద్యం అనర్థాలు, రహదారి నిబంధనలపై ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో వారు నిల్చోవాలని జడ్జి తీర్పును ఇచ్చారు. ఈ తీర్పు నేపథ్యంలో పోలీసులు ప్లకార్డులు ఇచ్చి వారితో ప్రదర్శన నిర్వహించారు. మందు బాబులకు విధించిన ఈ శిక్ష స్థానికంగా ఆసక్తికరంగా మారింది.


More Telugu News