Sajjan Kumar: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌కు శిక్ష ఖరారు

court grants life imprisonment to ex Congress MP in 1984 anti Sikh riots
  • కాంగ్రెస్ మాజీ ఎంపీకి శిక్షను ఖరారు చేసిన ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం
  • జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించిన న్యాయస్థానం
  • ఇప్పటికే తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్
ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు ఈరోజు శిక్షను ఖరారు చేసింది. నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన అల్లర్ల సమయంలో సరస్వతి విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌ను హతమార్చారన్న కేసులో ఆయనను కోర్టు ఇటీవల దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది.

సిక్కు అల్లర్లకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ ఇప్పటికే తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతనిపై మరో రెండు కేసులు న్యాయస్థానాలలో పెండింగులో ఉన్నాయి. 1984లో నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హత్య అనంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్ కుమార్ ఒక బృందానికి నాయకత్వం వహించినట్లు కోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది.
Sajjan Kumar
Congress
BJP
Sikh

More Telugu News