అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ఐదుగురు భక్తుల మృతి

   
అన్నమయ్య జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఏనుగుల దాడిలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శివరాత్రిని పురస్కరించుకొని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళుతుండగా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల మంద వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News