Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై ఆరోపణలు... సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

- వంశీ అక్రమాలకు పాల్పడ్డారంటున్న ప్రభుత్వం
- వంశీ వల్ల ప్రభుత్వానికి రూ.195 కోట్ల నష్టం వాటిల్లిందంటున్న సర్కారు
- నలుగురితో సిట్ ఏర్పాటు చేస్తూ నేడు ఉత్తర్వులు
- జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ నియామకం
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఆయనపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలోని ఈ సిట్ లో నలుగురు సభ్యులు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంశీ అక్రమాల వల్ల రూ.195 కోట్ల నష్టం వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. వంశీపై అక్రమ మైనింగ్, భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి.
గన్నవరం టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయన ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
తాజాగా ఆయనను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.