Hardik Pandya: పాక్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా గ‌ర్ల్‌ఫ్రెండ్... నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

Hardik Pandyas Rumoured Girlfriend Jasmin Walia Spotted At India Vs Pakistan CT 2025 Match In Dubai
  • భార‌త్‌, పాక్‌ మ్యాచ్‌కు క్యూక‌ట్టిన‌ సెల‌బ్రిటీలు
  • ఈ మ్యాచ్‌కు వ‌చ్చిన బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియా 
  • నటాషాతో విడాకుల‌ తర్వాత ఈ బ్రిటిష్ సింగ‌ర్‌తో హార్దిక్ రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం
  • దాయాదుల పోరుకు ఆమె హాజ‌రవ్వ‌డంతో ఈ ప్ర‌చారానికి మ‌రింత ఊతం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌కు వివిధ రంగాల‌కు చెందిన‌ సెల‌బ్రిటీలు క్యూక‌ట్టారు. అలా స్టాండ్స్‌లో ఉన్న అనేక మంది ప్రముఖులలో బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియా కూడా ఉన్నారు. నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా విడిపోయిన తర్వాత ఈ బ్రిటిష్ సింగ‌ర్‌తో రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

తాజాగా దుబాయ్‌లో దాయాదుల పోరుకు ఆమె హాజ‌రవ్వ‌డం ఈ ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూర్చింది. అక్ష‌ర్ ప‌టేల్ భార్య ప‌క్క‌నే ఆమె కూర్చొని టీమిండియాకు మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం నిజ‌మేన‌ని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక జాస్మిన్ వాలియా, హార్దిక్‌ జంట వార్తల్లోకి ఎక్క‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఎందుకంటే ఈ జంట ఆగస్టు 2024లో గ్రీస్‌లో క‌లిసి కనిపించినట్లు అప్ప‌ట్లో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే, వీరిద్దరూ క‌లిసి దిగిన ఫొటోలు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. 

ఇదిలాఉంటే... నిన్న‌టి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వేల‌కు పైగా పరుగులు, 200 ప్లస్‌ వికెట్లు తీసిన ఆరో భార‌త‌ క్రికెటర్‌గా హార్దిక్ ఎలైట్ జాబితాలో చేరాడు. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారు ఉన్న ఈ ఎలైట్ జాబితాలో ఇప్పుడు ఈ ఆల్‌రౌండ‌ర్ కూడా చేరాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వేల‌ కంటే ఎక్కువ ర‌న్స్‌, 200 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్- 34,357 పరుగులు, 201 వికెట్లు
కపిల్ దేవ్- 9,031 పరుగులు, 687 వికెట్లు
రవిశాస్త్రి- 6,938 పరుగులు, 280 వికెట్లు
రవీంద్ర జడేజా- 6,664 పరుగులు, 604 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్- 4,394 పరుగులు, 765 వికెట్లు
హార్దిక్ పాండ్యా- 4,149 పరుగులు, 200 వికెట్లు    
Hardik Pandya
Jasmin Walia
Girlfriend
Team India
Cricket
Sports News

More Telugu News