పాక్‌కు ఇంకా సెమీస్ అవ‌కాశాలు.. స‌మీక‌ర‌ణాలు ఇలా..!

  • ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆతిథ్య పాక్‌కు ఊహించ‌ని షాక్‌
  • ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓట‌మితో సంక్లిష్టంగా సెమీస్ అవ‌కాశాలు
  • ఈ రోజు కివీస్‌, బంగ్లా మ్యాచ్‌తో తేలిపోనున్న పాకిస్థాన్ భ‌విత‌వ్యం
ఛాంపియ‌న్స్ ట్రోఫీ రూపంలో దాదాపు 29 ఏళ్ల త‌ర్వాత పాకిస్థాన్‌ ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. అలాగే ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గాను బ‌రిలోకి దిగింది. అయితే, ఆతిథ్య జ‌ట్టుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ప‌రాజ‌యం పాలైంది. దీంతో పాక్‌కు సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇంకా చెప్పాలంటే ఆ జ‌ట్టు దాదాపు టోర్నీ నుంచి నిష్క్ర‌మించినట్టే!  

అయితే, ఈ రోజు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌తో పాకిస్థాన్ భ‌విత‌వ్యం తేలిపోనుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ విజ‌యం సాధిస్తే.. గ్రూప్‌-ఏ నుంచి న్యూజిలాండ్‌, భార‌త్ సెమీస్ కు వెళ‌తాయి. బంగ్లా, పాక్ నాకౌట్ ద‌శ నుంచే ఇంటిముఖం ప‌డ‌తాయి. ఒక‌వేళ న్యూజిలాండ్ ఓడితే మాత్రం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల‌కు సెమీ ఫైన‌ల్ అవ‌కాశాలు ఉంటాయి. అది ఎలాగో, స‌మీక‌ర‌ణాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పాక్ సెమీస్ చేరాలంటే స‌మీక‌ర‌ణాలు ఇలా...
  • ఇవాళ్టి మ్యాచ్‌లో కివీస్‌ను బంగ్లా ఓడించాలి
  • ఈ నెల 27న బంగ్లాతో జ‌రిగే మ్యాచ్‌లో త‌ప్ప‌కుండా పాక్ గెల‌వాలి
  • మార్చి 2న న్యూజిలాండ్‌తో జ‌రిగే పోరులో భార‌త్ విజ‌యం సాధించాలి
  • ఇలా జ‌రిగితే గ్రూప్‌-ఏలో టీమిండియా 6 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిలుస్తుంది. మిగ‌తా మూడు జ‌ట్లు చెరో 2 పాయింట్ల‌తో స‌మానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్ ర‌న్‌రేట్ ఉన్న టీమ్.. భార‌త్‌తో పాటు సెమీస్‌కు చేరుతుంది.


More Telugu News