Megastar Chiranjeevi: భారత్-పాక్ మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి... వీడియో ఇదిగో!

Megastar Chiranjeevi attends India and Pakistan clash at Dubai stadium
  • నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్
  • భారత్ నుంచి భారీగా తరలివచ్చిన వీఐపీలు 
  • తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన చిరంజీవి
దాయాదులు, దానికితోడు చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో కొదమ సింహాల్లా తలపడుతుంటే చూడడం ఓ జీవితకాలపు అనుభూతి. అందుకే ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ జట్లు ఆడుతుంటే చూసేందుకు ప్రముఖులంతా దుబాయ్ తరలి వెళ్లారు. వారిలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. 

ఆయన వీఐపీ గ్యాలరీలో టీమిండియా ఫ్యూచర్ స్టార్లమధ్య కూర్చుని మ్యాచ్ ను తిలకించారు. చిరంజీవికి అటువైపు తిలక్ వర్మ, ఇటువైపు అభిషేక్ శర్మ కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Megastar Chiranjeevi
India-Pakistan Match
Dubai

More Telugu News