ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్‌లో భారత జాతీయ గీతాలాపన.. వీడియో ఇదిగో!

  • లాహోర్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్
  • మ్యాచ్‌కు ఇరు జట్ల జాతీయ గీతాలాపన
  • ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులు భారత జాతీయ గీతాన్ని ఆలపించిన వైనం
  • ఆ వెంటనే తప్పు సరిదిద్దుకున్న పాక్ బోర్డు
  • సోషల్ మీడియాలో పాక్ బోర్డుపై ట్రోల్స్
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత రాత్రి లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు పెద్ద పొరపాటు జరిగింది. ఇంగ్లండ్ జాతీయ గీతాలాపన ముగిసిన తర్వాత, ఆస్ట్రేలియా గీతాన్ని ఆలపించాల్సి ఉండగా భారత జాతీయ గీతం ‘జనగణమన’లోని ‘భారత భాగ్య విధాత’ అని వినిపించడంతో ఆసీస్ ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యారు. అయితే, ఆ వెంటనే పొరపాటును గ్రహించి సరిదిద్దారు. అయితే, అప్పటికే అది ఇంటర్నెట్‌కు ఎక్కేయడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ట్రోల్స్ మొదలయ్యాయి. 

చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు నిరాకరించడంతో ఇండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన పాకిస్థాన్.. నేడు భారత్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు, ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కూడా. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి.


More Telugu News