తన తల్లికి అనారోగ్యం అంటూ వార్తలు... చిరంజీవి అసహనం
- మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత అంటూ వార్తలు
- ఆసుపత్రిలో చేరారంటూ కథనాలు
- క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
"మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదని, ఆమె ఆసుపత్రి పాలయ్యారంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలు నా దృష్టిలో పడ్డాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. రెండ్రోజులుగా ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారంతే. ఇప్పుడామె ఎంతో హుషారుగా, హాయిగా, పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. నేను మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే... దయచేసి ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాగానాలు పబ్లిష్ చేయొద్దు. అర్థం చేసుకుంటే సంతోషం!" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.