Maharashtra: ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు, ఉచితాలపై మహారాష్ట్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Maharashtra minister interesting comments on discounts in RTC buses
  • రాయితీలు ఇచ్చుకుంటూ వెళితే ఆర్టీసీని నడపడం కష్టమవుతుందని వ్యాఖ్య
  • మహిళలకు, వృద్ధులకు రాయితీ ఇస్తున్నామన్న రవాణా శాఖ మంత్రి
  • ఈ పథకాలతో ఆర్టీసీకి రోజూ రూ.3 కోట్ల నష్టం వస్తోందన్న మంత్రి
ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు, ఉచితాలపై మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయితీలు ఇచ్చుకుంటూ వెళితే ఆర్టీసీని నడపడం కష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ధారాశివ్‌లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇస్తోన్న రాయితీతో సంస్థకు రోజూ రూ.3 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కొత్తగా రాయితీలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికే, ఆర్టీసీల్లో మహిళలకు 50 శాతం రాయితీ, 75 ఏళ్లు పైబడిన వారికి రాయితీ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పథకాలతోనే ఆర్టీసీకి నష్టం వస్తోందని వెల్లడించారు. ఇలా అన్నింటా రాయితీలు ఇచ్చుకుంటూ వెళితే సంస్థను నడపలేమని ఆయన అన్నారు.
Maharashtra
RTC
Bus

More Telugu News