పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో ఇదిగో
- 'పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో 'హరిహర వీరమల్లు
- ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో చిత్రం
- ఫిబ్రవరి 24న 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ రిలీజ్
- ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్
"కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో" అంటూ సాగే ఈ పాటలో పవన్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, నటి అనసూయలను చూడొచ్చు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఈ పాటను ఆలపించారు.
కాగా, హరిహర వీరమల్లు చిత్రానికి అత్యధిక భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించడం తెలిసిందే. ఇంకా చిత్రీకరణ మిగిలుండగానే క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తాజాగా, సాంగ్ ప్రోమో రిలీజ్ లో టైటిల్స్ లో 'దర్శకత్వం జ్యోతికృష్ణ-క్రిష్ జాగర్లమూడి' అని వేయడం గమనించవచ్చు.
'హరిహర వీరమల్లు' చిత్రం మార్చి 28న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది.