KTR: ముఖ్యమంత్రిని అవమానించారంటూ కేసు నమోదు... హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

KTR files petition in HC over comments on chief minister
  • రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారని కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదు
  • కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
  • బాణసంచా కాల్చారంటూ ముషీరాబాద్‌లో మరో కేసు
  • కేసులు కొట్టివేయాలంటూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను తాను అవమానించలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించారంటూ కాంగ్రెస్ కార్యకర్త చేసిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద ముఖ్యమంత్రి రూ.2,500 కోట్లు తీసుకున్నట్లు కేటీఆర్ ఆరోపణలు చేశారని కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదు చేశారు.

ఎన్నికల ప్రచారంలో బాణసంచా కాల్చినందుకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

ఈ రెండు కేసులను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఎలాంటి కారణాలు లేకుండా పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ఈ పిటిషన్లపై తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.
KTR
Telangana
BRS
Revanth Reddy

More Telugu News