Tulasi Reddy: ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందుల నుంచి జగన్ గెలవడం కూడా కష్టమే: తులసిరెడ్డి

- పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్న తులసిరెడ్డి
- వంశీపై అక్రమ కేసు పెట్టారని చెప్పడం కరెక్ట్ కాదని వ్యాఖ్య
- కేసు అక్రమమా? సక్రమమా? అనేది కోర్టులో తేలుతుందన్న తులసిరెడ్డి
పోలీసులు, అధికారులపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. వల్లభనేని వంశీని పార్టీ అధ్యక్షుడిగా జగన్ జైలుకు వెళ్లి పరామర్శించడంలో తప్పు లేదని... వంశీ సచ్ఛీలుడు, ఆయనపై పెట్టింది అక్రమ కేసు అనడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పారు. వంశీపై పెట్టిన కేసు అక్రమమా? లేక సక్రమమా? అనేది కోర్టులో తేలుతుందని అన్నారు. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని... ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందులలో జగన్ గెలవడం కూడా కష్టమేనని వ్యాఖ్యానించారు.
మరోవైపు, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో... వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే విచారణ జరిపింది. తీర్పును రిజర్వ్ లో ఉంచింది. బెయిల్ కు సంబంధించి ఈరోజు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.