Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా

Hearing on Vallabhaneni Vamsi custody petition adjourned

  • కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్
  • 10 రోజుల కస్టడీకి అప్పగించాలన్న పోలీసులు
  • నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపిన పోలీసులు 

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుకు సంబంధించిన కిడ్నాప్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయిన సంగతి తెలిసిందే. టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే దళిత యువకుడ్ని కిడ్నాప్ చేసినట్టు వంశీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వంశీ ప్రస్తుతం విజయవాడ డిస్ట్రిక్ట్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

కాగా, వంశీని కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం... తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. వంశీ, మరో ఇద్దరిని 10 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు తమ పిటిషన్ లో కోరారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని  తెలిపారు. 

కోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

Vallabhaneni Vamsi
Custody
TDP Office Attack
Kidnap
Vijayawada
  • Loading...

More Telugu News