తెలంగాణ హైకోర్టులో ఓ కేసులో వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన న్యాయవాది
- ఓ కేసులో వాదనలు వినిపిస్తుండగా కుప్పకూలిన న్యాయవాది వేణుగోపాల్
- వెంటనే ఆసుపత్రికి తరలించిన కోర్టు సిబ్బంది
- మృతి చెందినట్లు ధృవీకరించిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు
21వ కోర్టు హాలులో న్యాయవాది వేణుగోపాలరావు ఒక కేసు విషయమై వాదనలు వినిపిస్తుండగా ఒక్కసారిగా నేలకొరిగారు. వెంటనే స్పందించిన న్యాయమూర్తి, తోటి న్యాయవాదులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. న్యాయవాది వేణుగోపాలరావు మృతికి సంతాపంగా 21వ కోర్టు హాలులో న్యాయమూర్తి విచారణను నిలిపివేశారు. మిగిలిన కోర్టు హాళ్లలో కూడా రెగ్యులర్ పిటిషన్ల విచారణను వాయిదా వేశారు.