Ponnam Prabhakar: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు నడపండి: ఆర్టీసీ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం

Ponnam Prabhakar orders on special buses on Shivaratri fest
  • ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం
  • భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు నడపాలన్న మంత్రి
  • రద్దీగా ఉండే బస్‌స్టాండ్లలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న మంత్రి
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాలకు భక్తులు భారీగా తరలివస్తారు. వేములవాడ, కీసర వంటి పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

ఈ రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా తరలి వచ్చే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు ప్రత్యేక బస్సులను నడపాలని ఆదేశించారు. బస్టాండ్‌ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Ponnam Prabhakar
Telangana
Shivaratri
Congress

More Telugu News