మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసు... కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్
- అమరావతి ఉద్యమం సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు
- అప్పట్లో కేసు నమోదు చేసినా... అరెస్టులు చేయని పోలీసులు
- ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సురేశ్ తరపు న్యాయవాదులు
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆయనపై మహాలక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అరెస్టులు మాత్రం జరగలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు విచారణలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే నందిగం సురేశ్ కోర్టులో లొంగిపోయారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం సురేశ్ తరపు న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.