Lakshmi Reddy: రోజా దగ్గర బంధువు అయిన మహిళతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం ఉంది: లక్ష్మిరెడ్డి

Kiran Reddy has illegal contact with a woman who is relative of Roja says Lakshmi Reddy

  • అవసరానికి వాడుకుని ఆమెపై దాడి చేశాడన్న లక్ష్మి
  • అభినయ్ రెడ్డితో తనకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడని మండిపాటు
  • మార్ఫింగ్ కేసులో కిరణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్

జనసేన నేత కిరణ్ రాయల్ పై లక్ష్మిరెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా దగ్గర బంధువైన మహిళతో కిరణ్ కు అక్రమ సంబంధం ఉందని ఆమె అన్నారు. గతంలో రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్ట్ అయ్యాడని... కానీ, రాత్రికి రాత్రే బయటకు వచ్చాడని... దీనికి కారణం రోజా బంధువుతో ఉన్న అక్రమ సంబంధమే కారణమని చెప్పారు. ఆ మహిళను బెదిరించి కిరణ్ బయటకు వచ్చాడని తెలిపారు. అవసరానికి వాడుకుని, అవసరం తీరాక ఆమెపై దాడి చేశాడని మండిపడ్డారు. తిరుపతిలో మీడియాలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డితో తనకు అక్రమ సంబంధం ఉందని కిరణ్ చెప్పడం దారుణమని లక్ష్మిరెడ్డి అన్నారు. అభినయ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకోవడం కిరణ్ కే చెల్లిందని అన్నారు. చెన్నై నుంచి చీరలు తెచ్చి శ్రీవారి వస్త్రం పేరుతో అమ్ముకుని వ్యాపారం చేస్తాడని చెప్పారు. ఫొటోలు మార్ఫింగ్ అని చెప్పి తనపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నే బ్లాక్ మెయిల్ చేస్తా... నువ్వెంత అని తనను బెదిరించాడని చెప్పారు. మార్ఫింగ్ కేసులో కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.   

Lakshmi Reddy
Kiran Royal
Janasena
  • Loading...

More Telugu News