Telangana: తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో రూ.21 కోట్లకు పైగా టోకరా

Advirtising company defrauds TSRTC of Rs 21 crore
  • ప్రకటనల ప్రదర్శనకు టీజీఎస్ఆర్టీసీతో 'గో రూరల్ ఇండియా' సంస్థ ఒప్పందం
  • డబ్బులు సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించిన ఈడీ
  • రూ.6.47 కోట్ల స్థిరాస్తులను జఫ్తు చేసిన ఈడీ
తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో 'గో రూరల్ ఇండియా' అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా వేసినట్టు వెల్లడైంది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ 'గో రూరల్ ఇండియా'కు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జఫ్తు చేసింది. బస్సులపై ప్రకటనల ప్రదర్శనకు టీజీఎస్ఆర్టీసీతో 'గో రూరల్ ఇండియా' ఒప్పందం కుదుర్చుకుంది.

కానీ ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వలేదని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా వివిధ అనుబంధ కంపెనీల ద్వారా వ్యాపారం నిర్వహంచినట్లు ఈడీ గుర్తించింది.

ప్రకటనల పేరుతో ఎంతోమంది కస్టమర్ల నుండి వచ్చిన డబ్బులను సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లుగా ఈడీ విచారణలో వెల్లడైంది. టీజీఎస్ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.21.72 కోట్ల బకాయిలను చెల్లించకుండా తమ అనుబంద సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు ఈడీ తేల్చింది.
Telangana
TGSRTC

More Telugu News