Sukesh Chandrasekhar: నేడు వాలెంటైన్స్ డే... నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఘాటైన ప్రేమలేఖ రాసిన సుఖేశ్ చంద్రశేఖర్

Sukesh Chandrasekhar wrote love letter to Jacqueline Fernandez

  • ఆర్థిక మోసాల కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్
  • నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన ప్రేయసి అంటూ గతంలో చెప్పిన ఘరానా మోసగాడు
  • సుఖేశ్, జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్
  • తాజాగా జైలు నుంచే ప్రేమలేఖ రాసిన సుఖేశ్

నేడు వాలెంటైన్స్ డే. ప్రపంచంలోని ప్రేమికులందరూ తమలోని భావాలను బయటికి తీసే రోజు ఇది. ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ కూడా ప్రేమికుల రోజు సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఉద్దేశించి ఘాటైన ప్రేమలేఖ రాశాడు. ఆర్థిక మోసాల కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. జైలు నుంచే అతడు జాక్వెలిన్ కు లవ్ లెటర్ రాశాడు. మరో జన్మంటూ ఉంటే నీ హృదయంలా జన్మనిస్తానని పేర్కొన్నాడు. 

"హ్యాపీ వాలెంటైన్స్ డే బేబీ... ఈ సంవత్సరం మనకు అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం ఉంది. జీవితకాలం లవర్స్ డేని సెలెబ్రేట్ చేసుకునేందుకు మనం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. ఈ ప్రపంచంలో నువ్వు అద్భుతమైన ప్రేయసివి. నీలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని లవర్ గా కలిగి ఉన్నందుకే ఈ భూమ్మీద నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరేమో. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ.  నాకు ఒక్కటే కోరిక... వచ్చే జన్మలో నీ హృదయాన్నై పుడతాను. 

ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా నీకొక అపురూపమైన కానుక ఇస్తున్నా. నువ్వు నీ కెరీర్ పనుల మీద విదేశాలకు వెళుతుంటావు... అందుకే నీకు ఒక ప్రైవేట్ జెట్ విమానాన్ని కానుకగా ఇస్తున్నా. ఆ విమానంపై నీ పేరులోని తొలి అక్షరాలు ముద్రించి ఉంటాయి... ఆ విమానం రిజిస్ట్రేషన్ నెంబరు కూడా నీ పుట్టినరోజు తేదీనే. ఈ విమానంలో నువ్వు ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణిస్తావని ఆశిస్తున్నాను" అంటూ సుఖేశ్ చంద్రశేఖర్ తన ప్రేమలేఖలో పేర్కొన్నాడు.  

కాగా, గతంలో సుఖేశ్,  జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె తన ప్రేయసి అని చెప్పుకున్నాడు. అతడి కేసుల వ్యవహారం జాక్వెలిన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చింది. అయితే, సుఖేశ్ తన జీవితంతో ఆడుకున్నాడని, అతడి కారణంగా తన కెరీర్ దెబ్బతిందని కోర్టుకు తెలిపింది.

Sukesh Chandrasekhar
Jacqueline Fernandez
Love Letter
Valentine's Day
  • Loading...

More Telugu News