Pawan Kalyan: ఎమ్మెల్సీ ఎన్నికలు... సమన్వయకర్తలను నియమించిన పవన్ కల్యాణ్

- రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
- పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించిన పవన్
- విజయవాడ సమన్వయకర్తగా అమ్మిశెట్టి వాసు
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా ముగిసింది. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో కూటమి పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి.
ఎన్నికలకు ముందు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జనసేన సమన్వయర్తలు వీరే:
- రాజమండ్రి - యర్నాగుల శ్రీనివాసరావు
- కాకినాడ - తుమ్మల రామస్వామి
- అమలాపురం - బండారు శ్రీనివాసరావు
- నరసాపురం - చన్నమల్ల చంద్రశేఖర్
- ఏలూరు - రెడ్డి అప్పలనాయుడు
- మచిలీపట్నం - బండి రామకృష్ణ
- విజయవాడ - అమ్మిశెట్టి వాసు
- గుంటూరు - నయబ్ కమల్
- నరసరావుపేట - వడ్రాణం మార్కండేయ బాబు