మస్తాన్ సాయి నాపై అత్యాచారం చేశాడు.. రాజ్ తరుణ్ పై కేసులు వెనక్కి తీసుకుంటా: లావణ్య
- మస్తాన్ సాయితో పార్టీల్లో పాల్గొన్నానన్న లావణ్య
- మత్తుమందు ఇచ్చి న్యూడ్ వీడియోలు తీశాడని వెల్లడి
- మస్తాన్ సాయి తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని ఆందోళన
తనకు మస్తాన్ సాయి తల్లదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని లావణ్య ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు తనను చంపేస్తారని అన్నారు. గడప దాటాలన్నా భయపడుతున్నానని చెప్పారు. అన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నానని... మస్తాన్ సాయిపై న్యాయపోరాటం చేస్తానని అన్నారు. తన పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టించుకోనని చెప్పారు.