Vallabhaneni Vamsi: నా భర్తకు ప్రాణహాని ఉంది.. పోలీసులు దురుసుగా ప్రవర్తించారు: వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ

Vallabhaneni Vamsi wife says he has life threat

  • కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్
  • వంశీ అరెస్ట్ వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న పంకజశ్రీ
  • తన భర్త అరెస్ట్ పై న్యాయపోరాటం చేస్తానని వ్యాఖ్య

కిడ్నాప్, దాడి, బెదిరింపు కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  

ఈ సందర్భంగా మీడియాతో వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ తన భర్తకు ప్రాణహాని ఉందని చెప్పారు. పోలీస్ స్టేషన్ లో విచారణ సమయంలో తన భర్త పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. తన భర్త అరెస్ట్ పై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. వంశీ అరెస్ట్ అక్రమమని... అరెస్ట్ వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని మేజిస్ట్రేట్ కు తన భర్త తెలిపారని చెప్పారు. 

మరోవైపు వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. తొలుత అర్ధరాత్రి 1.45 గంటల వరకు వాదనలు జరిగాయి. అయినప్పటికీ అవి కొలిక్కి రాకపోవడంతో మరో అరగంట పాటు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. ఆ తర్వాత వంశీతో పాటు శివరామకృష్ణ, లక్ష్మీపతిలకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించారు.

Vallabhaneni Vamsi
wife
Pankaja Sri
YSRCP
  • Loading...

More Telugu News