Deportation: కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ.. మరో రెండు విమానాల్లో తరలింపు

Two flights carrying illegal Indian immigrants will land tomorrow
  • ఇటీవల 104 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా
  • రేపు రానున్న మరో విమానంలో 180 మంది వరకు ఉండే అవకాశం
  • ఆ తర్వాత రానున్న మరో విమానం
  • విమానాలను అమృత్‌సర్‌లో ల్యాండ్ చేయిస్తుండటంపై పంజాబ్ ప్రభుత్వం ఆగ్రహం
అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం ఏరివేతను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల 104 మంది భారతీయులను బహిష్కరించి స్వదేశం పంపిన అమెరికా.. తాజాగా మరో రెండు విమానాల్లో ఇండియన్లను పంపతున్నట్టు సమాచారం. రేపు (15న) వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరో విమానంలో మరికొంతమందిని తరలించనుంది. 

అమెరికా బహిష్కరణ జాబితాలో మరో 487 మంది ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలను అమృత్‌సర్‌లో ల్యాండ్ చేస్తుండటంపై పంజాబ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడింది. ఆ విమానాలను బీజేపీ పాలిత హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ప్రశ్నించారు. ఇకపై వచ్చే విమానాలను అహ్మదాబాద్‌లో ల్యాండింగ్ చేయించాలని డిమాండ్ చేశారు.
Deportation
USA
Indians
Donald Trump

More Telugu News